ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్యాంగ్ లీడర్ వాయిదా పడితేనే... సాహూ సేఫ్?

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 05, 2019, 11:09 AM

350 కోట్ల తో నిర్మితమైన  ప్రభాస్ సాహో ప్రపంచవ్యాప్తంగా అధిక సంఖ్యలో స్క్రీన్‌లపై   భారీ అంచనాల నడుమ విడుదల అయ్యింది. .  బాక్సాఫీస్ వద్ద సాహో సృష్టిస్తున్న రికార్డులు  ప్రభాస్ అభిమానులలో   సంతోషం కలిగిస్తున్నట్టే, . సాహో నిర్మాతలకు  సినిమా కలెక్షన్ల కాస్త ఊరట ఇస్తున్నాయి. ఐతే ఈ వరం కొత్త సినిమాలు విడుదలకు సిద్ధం అవుతుండటంతో  క్లౌడ్ తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. గత ఐదు రోజుల్లో సాహో వాటా 175 కోట్లు ప్లస్ సాధించిందని నిర్మాతల మాట. ఐతే ఇందులో విదేశీ కలెక్షన్లు, హిందీ, తమిళం, మలయాళ వెర్షన్లు కూడా ఉన్నాయన్నది వాత్సవం. ఐతే  బాహుబలి 2  కలెక్షన్లతో  పోల్చి చూస్తే, సాహో కలెక్షన్స్  చాలా తక్కువని ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి.  ప్రభాస్ ఫేమ్, బాహుబలికి మించిన అంచనాలు కలసి వస్తాయని అధిక ధరతో సాహోను కొనుగోలు చేసిన చిత్ర పంపిణీదారులు ఈ టైములో కొత్త సినిమాలు విడుదలైతే నష్టపోతామన్న ఆందోళనలో ఉన్నారట. 13 సెప్టెంబర్ 2019 న నాని - గ్యాంగ్ లీడర్  విడుదలయ్యే నాటికీ కొంత సర్దుబాటు చేసుకున్న, అసలు లాభాలు మాట దేవుడెరుగు కొద్దిపాటి నష్టాలతో బైట పడతామన్నది వారి వాదన. 


గ్యాంగ్ లీడర్ మరో వరం వాయిదా వేయించడంతో పటు, ప్రభాస్తో సహా చిత్ర యూనిట్ తెలుగు రాష్ట్రాలలో పర్యటించడం, సోషల్ మీడియాలో యాక్టివ్ ప్రమోషన్ చేస్తే బైట పాడగలమని చెపుతున్నారు. మరి గ్యాంగ్ లీడర్ వాయిదా వేస్తారా అన్నది సంశయమే.  





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa