ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిలింసిటీలో కె.జి.య‌ఫ్ 2

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 05, 2019, 12:38 PM

య‌ష్ హీరోగా న‌టిస్తోన్న భారీ బ‌డ్టెట్ చిత్రం `కె.జి.య‌ఫ్ 2` ప్ర‌స్తుతం హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. నిజానికి ఈ షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో ప్లాన్ చేశారు. అయితే షూటింగ్ కార‌ణంగా అక్క‌డ వాతార‌వ‌ర‌ణం దెబ్బ తినే అవ‌కాశం ఉంద‌ని ఓ వ్య‌క్తి కేసు ఫైల్ చేశాడు. వాద‌న‌లు విన్న కోర్టు షూటింగ్‌ను ఆపేయ‌మ‌ని చెప్పింది. దీంతో చిత్ర యూనిట్ ఈ షెడ్యూల్‌ను రామోజీ ఫిలింసిటీలో ప్లాన్ చేసింది. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్ అధీర అనే ప‌వ‌ర్‌పుల్ విల‌న్ పాత్ర‌లో న‌టించ‌బోతున్నారు. `కె.జి.య‌ఫ్ 1` విజ‌య‌వంత‌మైన త‌ర్వాత `కె.జి.య‌ఫ్ 2`పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa