ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చివరి క్షణం ఫస్ట్‌లుక్‌ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 05, 2019, 06:35 PM

రత్న మేఘన క్రియేషన్స్‌ పతాకంపై శ్రీరాముల నాగరత్నం సమర్పిస్తున్న చిత్రం చివరి క్షణం. ధర్మ దర్శకత్వంలో ఆదిత్య శశాంక్‌, కవిత మహతో హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను శ్రీకాంత్‌ విడుదల చేశారు. ఈ చిత్ర దర్శక నిర్మాతలు మాట్లాడుతూ విడుదల చేసిన కొద్ది సమయంలోనే విశేష స్పందన లభించడం ఆనందంగా ఉంది. ఇక ఈ చివరి క్షణం సినిమా విషయానికి వస్తే హైదరాబాద్‌ మంచిర్యాల లొకేషన్స్‌లో టాకీ పార్ట్‌, ఒక సాంగ్‌ను చిత్రించాం. మిగిలిన మూడు పాటలను గోవాలో చేశాం. ఈ నెలాఖరులో ఆడియో విడుదల చేసి త్వరలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నామని తెలియచేసారు. ఆదిత్య శశాంక్‌, కవిత మహతో, సాకేత్‌ సాయి రామ్‌, స్నేహ, కోటయ్య చౌదరి, రాథోడ్‌, రామ్‌ కుర్నవల్లి, మురళి, రామకృష్ణ, వి.ఎస్‌.రామ రాజు, జ్యోతి, రాంరెడ్డి, దాస్‌, సంపత్‌ తదితరులు నటిస్తున్నారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa