ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'పాప'

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 31, 2025, 06:03 PM

కోలీవుడ్ నటుడు కవిన్, అపర్ణాదాస్ ప్రధాన పాత్రల్లో గణేష్ కె బాబు దర్శకత్వంలో తమిళంలో సంచలనం సృష్టించిన 'డా డా' తెలుగులో 'పపా' పేరుతో విడుదల అయ్యింది. తమిళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈ చిత్రం కోలీవుడ్‌లో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తెలుగులో ఎంజి మూవీస్ పతాకంపై అచ్చిబాబు ఈ సినిమాని విడుదల చేసారు. తండ్రీకొడుకుల సెంటిమెంట్‌తో రూపొందిన పాపా యొక్క తెలుగు వెర్షన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా వీడియో సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం ప్రసారానికి అందుబాటులోకి వచ్చినట్లు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. జెకె ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిర్మాత నీరజ కోట ఈ సినిమాని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa