త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరో, హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న సినిమా 'అల.. వైకుంఠపురములో...'. ఈ సినిమాలో సుశాంత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రధారులు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. కుటుంబం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. త్వరలో ఓ ఫారిన్ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారని తెలిసింది. విదేశాల్లోని అందమైన ప్రదేశాల్లో హీరో హీరోయిన్లపై పాటను చిత్రీకరించే ఆలోచనలో ఉన్నారట టీమ్. ఇటీవల వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా కొత్త పోస్టర్ విడుదలైంది. నవంబరు 7న త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఓ సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారట. ఆ రోజు ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేస్తారని ఊహించవచ్చు. జయరాం, టబు, సముద్రఖని, మురళీ శర్మ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు తమన్ స్వరకర్త. అల్లు అరవింద్, రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa