శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'ది ప్యారడైజ్'. కాగా, ఈ చిత్రంలో నాని పేరును ప్రకటిస్తూ ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ శుక్రవారం విడుదల చేశారు. 'జడల్' పాత్రలో నాని డిఫరెంట్ మాస్ లుక్‌లో రెండు జడలు వేసుకుని కనిపించి ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు. ‘ఇది ఒక అల్లికగా ప్రారంభమై.. విప్లవంగా ముగిసింది’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ సినిమా మొత్తం 8 భాషల్లో 2026 మార్చి 26న విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa