బాలీవుడ్ ప్రముఖ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్ హిమేశ్ రేష్మియాకు అరుదైన గౌరవం దక్కింది. 'బ్లూమ్‌బర్గ్' తాజాగా విడుదల చేసిన ‘గ్లోబల్ పాప్ పవర్ లిస్ట్’లో ఆయనకు చోటు దక్కింది. ఆ జాబితాలో భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి ఆయన ఒక్కరే ఉన్నారు. ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన పాప్ స్టార్ల లిస్ట్‌లో హిమేశ్కు 22వ స్థానం దక్కింది. దీనిపై ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa