టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల నిర్మాతగా కొత్త జర్నీ స్టార్ట్ చేసింది. చాలా రోజుల తర్వాత 'శుభం' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించడంతో పాటు ఇందులో కీలక పాత్రలో నటించి అందరినీ నవ్వించింది. అయితే ఈ చిత్రం ఏప్రిల్ 27న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అంతేకాకుండా నిత్యం పలు ఇంటర్వ్యూలో పాల్గొంటూ వార్తల్లో నిలుస్తోంది. అలాగే త్వరలోనే 'మా ఇంటి బంగారం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక గతంలో లాగా ఒకేసారి 5 చిత్రాలు కాకుండా నాణ్యత కలిగింది ఒక్కటే చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.ఎంత బిజీగా ఉన్నప్పటికీ సమంత పలు యాడ్స్, పాడ్‌కాస్ట్ అంటూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అంతేకాకుండా పలు హాట్ ఫొటోలు సైతం షేర్ చేస్తోంది. తాజాగా, సమంత కొన్ని హాట్ ఫొటోలు షేర్ చేసింది. ఇందులో బ్లాక్ కలర్ స్లీవ్‌లెస్ ధరించి ఆమె మత్తెక్కించే చూపులతో అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. ఈ ఫొటోలకు.. పరిశుభ్రతను ఎంచుకోవడం అంటే.. ప్రశాంతతను ఎంచుకోవడం. శుభ్రంగా ధరించడం అంటే జాగ్రత్తగా ఉండడం'' అని ఉన్న కొటేషన్ షేర్ చేసింది. ఇక సమంత ఫొటోలను చూసిన నెటిజన్లు సూపర్ అంటున్నారు. మరికొందరు మాత్రం షాక్ అవుతున్నారు. అసలు సమంతకు ఏమైంది ఇలా మారిపోయిందని ఆందోళన చెందుతున్నారు.