మంచు విష్ణు హీరోగా నటించిన 'కన్నప్ప' సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' వేదికగా సెప్టెంబర్ 4 నుంచి 'కన్నప్ప' చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ వివరాలను సోమవారం విష్ణు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ భారీ ప్రాజెక్టు థియేటర్లలో జూన్ 27న విడుదలై మంచి టాక్ అందుకుంది. ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్‌కుమార్ లాంటి అగ్ర నటులు కీలక పాత్రల్లో నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa