అనుష్క ఒక వైవిధ్యభరితమైన కథతో .. పవర్ఫుల్ రోల్ తో తెరపైకి రావాలని ఆమె అభిమానులంతా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో క్రిష్ దర్శకత్వంలో ఆమె చేసిన సినిమానే 'ఘాటి'. 15 ఏళ్ల క్రితం క్రిష్ కాంబినేషన్లో అనుష్క 'వేదం' సినిమా చేసింది. ఆ సినిమాలో ఆమె చేసిన 'సరోజ' పాత్ర ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత వాళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమానే 'ఘాటి'. ఈ రోజునే థియేటర్లకు ఈ సినిమా వచ్చింది.
కథ: ఆంధ్ర - ఒడిశా బోర్డర్ లోని తూర్పు కనుమలలో ఈ కథ మొదలవుతుంది. తూర్పు కనుమల గుండా గంజాయి అక్రమ రవాణా జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాంతంలో 'షీలావతి' అనే రకం గంజాయికి విపరీతమైన డిమాండ్ .. అంతర్జాతీయ మార్కెట్లో భారీ రేటు ఉంటుంది. ఆ చుట్టూ పక్కల గ్రామస్తులంతా గంజాయిని మోసే కూలీలుగా తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి ఒక గ్రామానికి చెందిన జంటనే షీలావతి (అనుష్క) దేశిరాజు ( విక్రమ్ ప్రభు). పుట్టగానే షీలావతి తల్లిని పోగొట్టుకోగా, పోలీస్ కాల్పుల్లో దేశిరాజు తన తండ్రిని కోల్పోతాడు. ఆ కనుమల నుంచి నాయుడు (రవీంద్ర విజయ్) .. అతని తమ్ముడైన కుందల్ ( చైతన్య రావు) గంజాయి వ్యాపారాన్ని విస్తరిస్తూ వెళుతుంటారు. వాళ్లను కాదని 'ఘాటి'లు మరెక్కడా పని చేయకూడదు .. వేరు కుంపటి పెట్టకూడదు అనే కఠినమైన నిబంధన ఉంటుంది. వాళ్ల దగ్గరే షీలావతి - దేశిరాజు ఇద్దరూ కూడా 'ఘాటి'లు గా పని చేస్తూ ఉంటారు. ఇద్దరూ ప్రేమించుకుంటారు .. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు.అయితే తరతరాలుగా 'ఘాటి'లకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి నాయుడు (రవీంద్ర విజయ్)ని దేశిరాజు నిలదీస్తాడు. ఈ విషయంలో దేశిరాజుపై నాయుడి తమ్ముడు కుందల్ (చైతన్య రావు) పగబడతాడు. అంతేకాదు దేశిరాజు వివాహం చేసుకోవలసిన షీలావతిపై మనసు పడతాడు. ఇక ఈ ప్రాంతంలో జరుగుతున్న గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గా విశ్వదీప్ (జగపతిబాబు) రంగంలోకి దిగుతాడు. ఆ కొండ ప్రాంతం నుంచి గంజాయి బస్తాలలోనే కాదు, లిక్విడ్ రూపంలోను తరలించబడుతోందనే విషయం అతనికి అర్థమవుతుంది. ఈ అక్రమానికి పాల్పడుతున్నది ఎవరు? వాళ్లను విశ్వదీప్ నియంత్రించగలుగుతాడా? షీలావతితో దేశిరాజు వివాహం జరుగుతుందా? అనేది మిగతా కథ.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa