ప్రిన్స్, మహావీరుడు, అమరన్ వంటి తమిళ అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు శివ కార్తీకేయన్. ఆయన నటించిన తాజా చిత్రం 'మదరాసి'. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు మురుగదాస్ నిర్ధేశకుడు కావడంతో ఈ చిత్రంపై తెలుగులో కూడా మంచి బజ్ ఏర్పడింది. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక శివ కార్తికేయన్ 'మదరాసి'గా ఆకట్టుకున్నాడా? గత కొంతకాలంగా సక్సెస్ ఎదురుచూస్తున్న దర్శకుడు మురుగదాస్‌కు ఈ చిత్రంతో సక్సెస్ దక్కిందా లేదా? రివ్యూలో తెలుసుకుందాం..
కథ: తమిళనాడులో గన్ కల్చర్‌ను విస్తరించి తద్వారా కోట్లాది రూపాయాలను సొమ్ము చేసుకోవాలని ఓ సిండికేట్ ముఠా ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగా విరాట్ ( విద్యుత్ జమ్వాల్), చిరాగ్ (షబ్బీర్ కల్లరక్క) అనే ఫ్రెండ్స్‌ని ఇందులో ఇన్‌వాల్వ్ చేసి ట్రక్కులతో ఆయుధాలను ఓ ప్లేస్‌కు తరలిస్తారు. ఈ విషయం ఎన్‌ఐఏ సంస్థకు తెలుస్తుంది. ఎన్‌ఐఏకు సారథ్యం వహిస్తున్న ప్రేమ్‌నాథ్ (బీజు మేనన్) ఆ ఆయుధాలను రాష్ట్రంలోకి రావడం ఆపలేకపోవడంతో, ఎలాగైనా ఆయుధాలు ఉన్న ప్లేస్‌ని బాంబులతో పేల్చాలని ఒక ఆపరేషన్ స్టార్ట్ చేస్తాడు. ఈ సమయంలోనే సూసైడ్ చేసుకోవాలనుకున్న రఘురామ్‌ను ( శివ కార్తికేయన్) ఈ ఆపరేషన్‌లో ఇన్‌వాల్వ్ చేయాలని ప్రేమ్‌నాథ్ డిసైడ్ అవుతాడు. అసలు ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యిందా? రఘురామ్ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు? రఘురామ్‌కు మాలతికి ఉన్న సంబంధమేమిటి? ఇలాంటి విషయాలు మిగతా కథలో తెలుస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa