రోడ్డు ప్రమాదంలో హీరోయిన్ కాజల్‌కు తీవ్ర గాయాలు అయ్యాయని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీనిపై నటి కాజల్ తాజాగా స్పందింది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని ఖండించింది. దేవుడి దీవెనలతో తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఫన్నీగా ఉంటాయని కాజల్ అగర్వాల్ పేర్కొంది. తప్పుడు ప్రచారాలపై ఫోకస్ చేయకుండా నిజాలపై దృష్టి పెట్టాలని కోరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa