ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'సు ఫ్రామ్ సో'

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 09, 2025, 08:25 AM

కన్నడ బ్లాక్ బస్టర్ 'సు ఫ్రామ్ సో' ఇటీవలే ఇతర భాషలలో విడుదల అయ్యి సాలిడ్ హిట్ గా నిలిచింది. జె. పి. తుమినాడ్ దర్శకత్వం వహించిన హర్రర్ కామెడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద 120 కోట్లు వాసులు చేసింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని జియో హాట్స్టార్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో అసలు కన్నడ విడుదలతో పాటు తెలుగు మరియు మలయాళం డబ్డ్ వెర్షన్లు అందుబాటులో ఉన్నాయి. రాజ్ బి. శెట్టి నిర్మించిన ఈ చిత్రంలో షానెల్ గౌతమ్, సంధ్య అరకేరే, ప్రకాష్ తుమినాడ్ మరియు ఇతరులు సహాయక పాత్రలలో ఉన్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని సుమెద్ కె. మరియు సందీప్ తులాసిదాస్ స్వరపరిచారు. లైట్ బుద్ధ ఫిలిమ్స్, శ్రీ దేవి ఎంటర్టైనర్స్ సహకారంతో ఈ సినిమాని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa