ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్‌కు GHMC అధికారులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 45లో ఆయన అల్లు బిజినెస్ పార్క్ పేరిట ఓ భవనం నిర్మించారు. అయితే, ఇటీవల ఆ భవనంపై అదనంగా పెంట్‌హౌస్ నిర్మించారు. దీంతో అక్రమంగా నిర్మించిన పెంట్‌హౌస్ ను ఎందుకు కూల్చకూడదో వివరణ ఇవ్వాలని GHMC అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. వివరణ ఇవ్వకుంటే కూల్చివేత చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa