టాలీవుడ్ నటి, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ మరోసారి సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించారు. ఓ అభిమాని “మేము మిమ్మల్ని ఇంకా పవన్ భార్యగానే చూస్తాం, మీ జీవితంలో వేరొకరిని ఊహించలేం” అని రాసిన కామెంట్‌కు ఆమె కఠినంగా సమాధానమిచ్చారు. 2025లోనూ మహిళలను భర్త/తండ్రి ఆస్తిలా చూడటం పితృస్వామ్యపు ధోరణి అని విమర్శించారు. ఫెమినిజం అంటే స్వేచ్ఛగా తిరగడం కాదని, మహిళల్ని పశువుల్లా చూడడాన్ని ప్రశ్నించడమేనని పేర్కొన్నారు. ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa