|
|
by Suryaa Desk | Tue, Apr 30, 2024, 10:28 AM
వల్లూరు మండలం తొల్లగంగన్నపల్లి థెరిస్సా నగర్ కు చెందిన వైసీపీ మద్దతుదారుడు ఎం.ప్రభాకర్ పై రాడ్లతో కత్తులతో టిడిపి వర్గీయులు సోమవారం రాత్రి దాడి చేశారు. క్షతగాత్రుడికి కంటి వద్ద కత్తితో బలమైన గాయం కావడంతో హుటాహుటిన కడప రిమ్స్ కు తరలించారు. ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలికి పోలీసులు చేరుకొని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Latest News