by Suryaa Desk | Thu, Jun 27, 2024, 04:18 PM
పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం దేవలంపేట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలో ఉదయం స్వామివారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం అర్చనలు పూజలు జరిపి నైవేద్యం సమర్పించి మహా మంగళహారతి గావించారు. ఆలయ ప్రధాన అర్చకులు అనంత కుమారాచార్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
Latest News