by Suryaa Desk | Mon, Jul 01, 2024, 02:56 PM
నెల్లూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున కొత్తహాలు వెనుక ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. శ్రీరామ్ చిట్ ఫండ్ కంపెనీ కార్యాలయంలో మొదటిగా మంటలు వ్యాపించాయి. అనంతరం దిగువ అంతస్థులో బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి మంటలు చెలరేగాయి. భారీ అగ్నిప్రమాదంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. శ్రీరామ్ చిట్ ఫండ్ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగాయని ప్రాథమిక అంచనా. అయితే అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Latest News