by Suryaa Desk | Sun, Nov 24, 2024, 03:12 PM
విశాఖపట్నం రైల్వే జోన్ అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రైల్వే జోన్ కార్యాలయం నిర్మాణానికి రైల్వేశాఖ తాజాగా టెండర్లు ఆహ్వానించింది. డిసెంబర్ 27లోగా టెండర్లు దాఖలు చేయాలని తెలిపింది. అలాగే టెండర్లు దక్కించుకున్నవారు రెండేళ్లలో భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని రైల్వేశాఖ పేర్కొంది. కాగా, ఈ కార్యాలయాన్ని రూ. 149.16 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్నారు. ఇక కార్యాలయం నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం ఇప్పటికే 53 ఎకరాల భూమిని రైల్వేశాఖకు అప్పగించిన విషయం తెలిసిందే. మొత్తం 11 అంతస్తుల్లో భవన నిర్మాణం జరగనుంది. ఇందులో రెండు సెల్లార్ పార్కింగ్ ఫ్లోర్లు ఉండనున్నాయి.
Latest News