by Suryaa Desk | Sun, Nov 24, 2024, 10:20 PM
ఇంట్లోకి ఏ చిన్న వస్తువు కావాలన్నా వెంటనే సమీపంలోని కిరాణా దుకాణానికి వెళ్లి తెచ్చుకుంటాం. ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర సరుకులతో పాటు చాలా వస్తువులు ఈ కిరణాల్లో లభిస్తాయి. ఒక్కో వీధిలో ఒకటికి మించి కిరాణా దుకాణాలు ఉంటాయి. కానీ, ముందు ముందు కిరాణా షాపులను వెతుక్కోవాల్సిన పరిస్థితులు రాబోతున్నాయి. గత దశాబ్దకాలంలో భారత రిటైల్ రంగానికి కీలకంగా ఉన్న ఈ కిరాణా షాపులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. దాదాపు 2 లక్షల కిరాణా షాపులు మూతపడ్డాయని వర్తక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అందుకు కారణం క్విక్ కామర్స్ సంస్థలు వేగంగా విస్తరించడమేనని చెబుతున్నాయి. ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లోనే ఇంటి వద్దకే కిరాణా సరుకులు తీసుకొస్తున్నాయి. దీంతో వాటివైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. కొత్త కొత్త ఆఫర్లు, ఎలాంటి శ్రమ లేకుండా పని పూర్తవడంతో క్విక్ కామర్స్ సంస్థలనే ఆశ్రయిస్తున్నారు. దీంతో కిరాణా దుకాణాల్లో అమ్మకాలు తగ్గిపోతున్నాయి.
ఈ ఏడాదిలో సంప్రదాయ కిరాణఆ షాపుల నుంచి రూ.10,700 కోట్ల మేర విక్రయాలు క్విక్ కామర్స్ సంస్థల చేతికి వెళ్లొచ్చని డేటమ్ ఇంటెలిజెన్స్ నివేదిక తెలిపింది. కిరాణా షాపుల్లో కొనుగోళ్లు తగ్గించినట్లు 46 శాతం మంది చెప్పినట్లు ఈ రిపోట్ తెలిపింది. ప్రస్తుతం మార్కెట్లో టాటా గ్రూప్ సంస్థ బిగ్ బాస్కెట్, జొమాటోకు చెందిన బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్, జెప్టో, జియో మార్ట్ వంటి క్విక్ కామర్స్ సంస్థలు నిమిషాల వ్యవధిలోనే డెలివరీలు చేపడుతున్నాయి. ఈ క్విక్ కామర్స్ సంస్థలు వచ్చాక విక్రయాలు భారీగా తగ్గిపోయాయని 67 శాతం మంది వర్తకులు తెలిపినట్లు నివేదిక పేర్కొంది. అలాగే వినియోగదారుల్లో 82 శాతం మంది కనీసం 25 శాతం చొప్పున క్విక్ కామర్స్‌లో కొంటున్నట్లు చెప్పారని తెలిపింది. 5 శాతం మంది ఇప్పటికే కిరాణాల్లో కొనడం ఆపేశారటా. కిరాణా దుకాణాలతో పోలిస్తే ఆన్‌లైన్‌లో రాయితీలు, ప్రత్యేక ఆఫర్లు లభిస్తున్నాయని, అందుకే వాటి వైపు వెళ్తున్నట్లు 66 శాతం మంది చెప్పినట్లు తెలిపింది.
ఓవైపు క్విక్ కామర్స్ సంస్థలు విస్తరించడ, మరో పక్క ఇ-కామర్స్ విక్రయాలు, వినియోగదారుల వ్యయాలు తగ్గడంతో కిరాణా దుకాణాలు గడ్డు కాలం ఎదుర్కొంటున్నాయి. ఈ కారణంతో సంప్రదాయ డిస్ట్రిబ్యూటర్లను కాపుడుకుంటూ, ఆన్‌లైన్ వ్యవస్థలను అందిపుచ్చుకునేందుకు డాబర్, గోద్రేజ్, మారికో, హెచ్యూఎల్ వంటి వాటికి సవాలుగా మారిందని చెప్పవచ్చు. అలాగే సాధారణ వాణిజ్య నెట్‌వర్క్స్‌లో బలహీనతలు నమోదవుతున్న క్రమంలో కంపెనీలు తమ నిల్వలను తగ్గించుకుంటున్నాయి. జీటీ భాగస్వాములు సవాళ్లు ఎదుర్కొంటున్నరాని, దీంతో లాభదాయకతపై ఒత్తిడి పడకుండా విక్రయాల కోసం ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతూ వాటా పెంచుకుంటున్నట్లు డాబర్ తెలిపింది.
Latest News