ఏపీ ఫైబర్ నెట్ ఉద్యోగులకు షాక్.. 410 మంది తొలగింపు.. ఛైర్మన్ సంచలన నిర్ణయం
 

by Suryaa Desk | Tue, Dec 24, 2024, 06:28 PM

ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఫైబర్‌నెట్ ప్రక్షాళన దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఫైబర్‌ నెట్ నుంచి 410 మంది ఉద్యోగులను తొలగిస్తామని ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి ప్రకటించారు. మంగళవారం విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించిన జీవీ రెడ్డి.. ఏపీ ఫైబర్ నెట్‌ను ప్రక్షాళన చేస్తున్నట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో అర్హత లేని వారిని ఫైబర్ నెట్‌ ఉద్యోగులుగా నియమించారన్న జీవీ రెడ్డి.. వైసీపీ నేతల ఆదేశాలతో అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చారన్నారు. ఈ నేపథ్యంలోనే గత వైసీపీ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా నియమించిన 410 మంది ఉద్యోగులను ఫైబర్ నెట్ నుంచి తొలగిస్తామని జీవీ రెడ్డి ప్రకటించారు. అలాగే మరో 200 మందిని కూడా తొలగించనున్నట్లు వెల్లడించారు.


2016-19 మధ్య 108 మంది ఉద్యోగులతో ఫైబర్ నెట్ నడిచిందన్న జీవీ రెడ్డి.. అప్పట్లో ఫైబర్‌ నెట్‌కు 10 లక్షల కనెక్షన్లు ఉండేవన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వా 2019-24 మధ్య ఫైబర్ నెట్ ఉద్యోగుల సంఖ్యను 1360కి పెంచారని..కనెక్షన్లు ఐదు లక్షలకు పడిపోయాయని జీవీ రెడ్డి ఆరోపించారు. బిజినెస్ పెరగక.. నష్టాలు వచ్చాయని మండిపడ్డారు. వైసీపీ హయాంలో తీసుకున్న ఉద్యోగుల్లో వైసీపీ నేతల సిఫార్సుతో ఎక్కువ మంది వచ్చారని.. నిబంధనలు విరుద్ధంగా ఆఫర్ లెటర్, అపాయింట్‌మెంట్ లెటర్ కూడా లేకుండా ఉద్యోగాలిచ్చారని ఆరోపించారు. వైసీపీ నియమించిన సిబ్బందిలో కొంతమంది అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతల ఇళ్లల్లో పనిచేశారని.. వారికి ఫైబర్ నెట్ నుంచి వేతనాల పేరిట కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగిందని ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి ఆరోపించారు.


వైసీపీ తీరుతో ఫైబర్ నెట్ దివాళా తీసే పరిస్థితికి వచ్చిందన్న ఆయన.. ఫైబర్ నెట్ ఉద్యోగులకు లీగల్ నోటీసులు ఇస్తామని తెలిపారు. లీగల్ నోటీసులు ఇచ్చి వివరణ కోరతామని.. అలాగే ఇకపై ఫైబర్ నెట్ అవసరాల మేరకు మాత్రమే ఉద్యోగులను తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు రామ్‌గోపాల్ వర్మ వ్యూహం సినిమా చెల్లింపులపైనా జీవీ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బు చెల్లించాలని రామ్‌గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చామన్న ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్.. 15 రోజుల గడువు ఇచ్చినట్లు తెలిపారు. గడువులోగా డబ్బు చెల్లించకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.

Latest News
Dr Singh played key role in elevating US-India ties, modernising relationship: USIBC Fri, Dec 27, 2024, 10:48 AM
4th Test: Shastri asks Team India 'What was the need for two spinners if you don't trust them?’ Fri, Dec 27, 2024, 10:46 AM
PM with a Maruti 800 heart: Asim Arun's tribute to Dr Singh's simplicity Fri, Dec 27, 2024, 10:40 AM
4th Test: Cummins removes Rohit, Rahul as India trail Australia by 423 runs at Tea Fri, Dec 27, 2024, 10:32 AM
South Africa leg of CT 2025 trophy tour concludes, next stop Australia Thu, Dec 26, 2024, 04:59 PM