రూ. 10 లక్షల లోన్.. 10 శాతం వడ్డీ.. ఎన్నేళ్లకు ఈఎంఐ ఎంత కట్టాల్సి వస్తుందో తెలుసా
 

by Suryaa Desk | Tue, Dec 24, 2024, 10:35 PM

మీరు పర్సనల్ లోన్ కోసం చూస్తున్నారా? చాలా బ్యాంకులు ఇప్పుడు పర్సనల్ లోన్ ఆఫర్ చేస్తున్నాయి. ఇంకా ఒకప్పటితో పోలిస్తే ప్రాసెస్ కూడా వేగంగా జరుగుతోంది. వేగంగానే అకౌంట్లోకి డబ్బులు వచ్చి పడుతున్నాయని చెప్పొచ్చు. అయితే.. లోన్లు తీసుకునే ముందు వడ్డీ రేట్లను పోల్చుకోవాలి. ఈఎంఐ కాలిక్యులేటర్‌ను ఉపయోగించి ఎంత ఈఎంఐ పడుతుందో తెలుసుకోవాలి. నిర్దిష్ట మొత్తం లోన్‌‌కు ఎన్ని సంవత్సరాల వ్యవధికి.. ఈఎంఐ ఎంత పడుతుందని లెక్కలేసుకోవాలి. అప్పుడే ఒక అవగాహన వస్తుంది. ఎంత లోన్.. ఎన్నేళ్ల కాలానికి తీసుకోవచ్చో తెలుస్తుంది. అందుకే.. అత్యవసర పరిస్థితుల్లో డబ్బు కావాలంటే పర్సనల్ లోన్ ఎంచుకోవడం బెస్ట్ అని చెప్పొచ్చు.


ఇందుకోసం ముందుగా మీ అర్హతలు చెక్ చేసుకోవాలి. అయితే కొందరు ఒకటి కంటే ఎక్కువ సార్లు పర్సనల్ లోన్లు తీసుకుంటారు. అవసరాలు అలాంటివి మరి. పెళ్లి కోసమైనా, ఇంటి రెనోవేషన్ కోసం, వెకేషన్‌కు ప్లాన్ చేసినా, ఏదైనా విలువైన వస్తువు కొనాల్సి వచ్చినా డబ్బులు కాస్త ఎక్కువే అవసరం పడతాయి. అయితే ఎక్కడైనా లోన్ తీసుకునే ముందు వడ్డీ రేట్లను పోల్చుకోవాలి. ఏ బ్యాంకులో వడ్డీ రేట్లు తక్కువ ఉన్నాయి.. ఎంత లోన్ తీసుకుంటే ఈఎంఐ ఎంత పడుతుందో అంచనా వేసుకోవాలి. తర్వాత బ్యాంకును ఎంచుకోవాల్సి ఉంటుంది.


ఇప్పుడు వేర్వేరు సెనేరియోలకు రూ. 10 లక్షల పర్సనల్ లోన్ తీసుకుంటే.. ఎంత శాతం వడ్డీకి.. ఎన్నేళ్లకు ఈఎంఐ ఎంత పడుతుందో మనం ఇప్పుడు చూద్దాం. 


సెనేరియో 1- రూ. 10 లక్షల రుణం తీస్కొని.. 10 శాతం వడ్డీతో ఐదేళ్లకు చెల్లించాలనుకుందాం. ఇక్కడ ఈఎంఐ రూ. 21,247 చొప్పున పడుతుంది. అయితే .. కాస్త తక్కువ ఈఎంఐకి మొగ్గుచూపితే అప్పుడు ఎక్కువ కాలం చెల్లించాల్సి వస్తుంది.


సెనేరియో 2- ఇక 10 లక్షల లోన్ తీసుకొని.. 10 శాతం వడ్డీకే ఆరేళ్ల వ్యవధిని ఎంచుకున్నట్లయితే ఇక్కడ ఈఎంఐ రూ. 18,525 చొప్పున పడుతుంది.


సెనేరియో 3- అయితే.. ఇంకాస్త తొందరగానే తీర్చేయాలంటే ఇంకా తక్కువ వ్యవధి ఎంచుకోవాలి. ఇప్పుడు ఇదే మూడేళ్ల వ్యవధిని ఎంచుకుంటే అప్పుడు రూ. 10 లక్షలపై ఈఎంఐ రూ. 32,267 పడుతుంది.


సెనేరియో 4- అయితే మీరు లోన్ త్వరగా తీర్చేయాలని ఉన్నా.. ఇంత పెద్ద మొత్తం ఈఎంఐ చెల్లించలేకపోతే అప్పుడు లోన్ అమౌంట్ కాస్త తగ్గించుకోండి. ఉదాహరణకు రూ. 8 లక్షల రుణం తీసుకుంటే అదే 10 శాతం వడ్డీకి మూడేళ్లకు ఈఎంఐ రూ. 25,813 చొప్పున పడుతుంది. ఇలా కాలిక్యులేటర్ ఉపయోగించుకొని.. ఏది మీకు సెట్ అవుతుందో సెలక్ట్ చేసుకోవడం ఉత్తమం.


Latest News
PM Modi’s aura unmatchable: Global delegates at 18th Pravasi Bharatiya Divas Thu, Jan 09, 2025, 05:30 PM
How long can you stare at your wife at home? Come to office and work 90-hr a week: L&T Chairman Thu, Jan 09, 2025, 05:01 PM
Indian-origin researcher finds gene behind autism and seizures Thu, Jan 09, 2025, 05:00 PM
INDIA bloc only for general elections, Cong building momentum for Delhi: Khera Thu, Jan 09, 2025, 04:59 PM
Record 2.79 crore registrations for 'Pariksha Pe Charcha' Thu, Jan 09, 2025, 04:44 PM