by Suryaa Desk | Sat, Jan 25, 2025, 01:57 PM
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో 15 ఏళ్ల తర్వాత అరుదైన పుష్పం వికసించింది. దీని పేరు 'కార్ప్స్ ఫ్లవర్'. ఇది అత్యంత భారీ ఆకారంతో, ముక్కుపుటాలు అదిరిపోయేలా దుర్గంధాన్ని వెదజల్లుతుంది. ఇది మొదటగా 1878లో ఇండోనేషియాలోని సుమత్రా వర్షారణ్యాలలో వికసించింది.
ఇది దాదాపు 3 మీ. పొడవు, 150 కేజీల బరువు ఉంటుంది. ఇది వికసించిన 24 గంటలు మాత్రమే తాజాగా ఉంటుంది. అయితే ఇది అన్ని పుష్పాల సుగంధాలను వెదజల్లదు. కుళ్లిన మాంసం లాంటి వాసనను వెదజల్లుతుంది.