by Suryaa Desk | Sat, Jan 25, 2025, 02:16 PM
దావోస్ పర్యటనపై ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘దావోస్ అనేది నాకు కొత్త కాదు.. దావోస్‌కు వెళ్లాలని ట్రెండ్ చేసిందే నేను’ అని అన్నారు. '1997 నుంచి దావోస్‌కు వెళ్తున్నాను.
దావోస్‌లో మొత్తం 27 సమావేశాలు జరిగాయి. హైదరాబాద్ అంటే ఒకప్పుడు ఏది అని ఆ సమయంలో అడిగేవారు. అప్పట్లో హైదరాబాద్‌ను ప్రమోట్ చేశా. ఇప్పుడు ఏపీని ప్రమోట్ చేస్తున్నా' అని చంద్రబాబు వెల్లడించారు.