by Suryaa Desk | Sat, Jan 25, 2025, 03:15 PM
విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడంపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. విజయ్ సాయి రెడ్డి ఉన్న ఐదేళ్లు.. విశాఖ ప్రజలకు ఒక పీడకల అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయన కన్ను పడిన భూములు వారికి దాకాల్సిందే అని అన్నారు. తన భూములే చాలా వరకు ఉన్నాయని.. బెదిరించి తీసుకుని వారి కుటుంబాల పేరు మీద మార్పించుకున్నారని ఆరోపించారు. వైజాగ్ పైల్స్ పేరుతో గతంలో ఆ వివరాలను బయటపెట్టామన్నారు. విశాఖలో అనేక మందిని బెదిరించి కూల్చివేతలు చేశారని.. భూములు ఆక్రమించుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో జగన్ అక్రమాలు చేస్తే, విశాఖలో అంతకుమించి అరాచకాలు చేశారన్నారు. ఆయన ట్వీట్ చూస్తుంటే జాలి, నవ్వు, ఆశ్చర్యం వస్తుందన్నారు. ఆయన ద్వారా నష్టపోయిన వారికి ఎవరు న్యాయం చేస్తారని ప్రశ్నించారు. సాయి రెడ్డి విశాఖలో చేసిన పనులను ప్రజలు మర్చిపోరని అన్నారు. చేసిన తప్పులన్నింటికీ చట్టాపరంగా చర్యలు ఉంటాయని.. తప్పించుకోలేరని.. బాధ్యులవుతారు అనుభవించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. వైసీపీ మునుగుతున్న పడవ అని... చివరికి జగన్ తప్పితే ఎవరూ మిగలరంటూ కామెంట్స్ చేశారు. జగన్‌కు నీడ లాంటి వ్యక్తి భాగస్వామి.. రాజీనామా చేసి బయటకు వెళ్తున్నారంటే పరిస్థితి ఏంటో అర్థం అవుతుందన్నారు.
Latest News