by Suryaa Desk | Sat, Jan 25, 2025, 03:27 PM
ఆరోగ్య ప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి హుండీల లెక్కింపు శుక్రవారం ఆలయ అనివెట్టి మండపంలో జరిగింది. 65 రోజులకు గాను రూ.66,89,389 ఆదాయం లభించింది. ఇందులో నోట్ల రూపేణా రూ.63,88,254, చిల్లర ద్వారా రూ.3,01,135 సమకూరాయి. ఉదయం 9.00 గంటలకు ఆలయ అనువంశిక ధర్మకర్త ఇప్పిలి జోగి సన్యాసిరావు, ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, ఈవో వై.భద్రాజీ, పాతపట్నం ఈవో వాసుదేవరావు, ఆమదాలవలస ఈవో టి.రవి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీహరి సేవాసమితి, సత్యసాయి సేవాసమితి, శ్రీవారి సేవా సమితి ప్రతినిధులు పాల్గొని లెక్కింపు చేపట్టారు. ఇందులో బంగారం 58 గ్రాములు, వెండి 2.137 కిలోలు, యూఎస్ డాలర్స్-56, నేపాల్-20, దిర్మామ్స్-10, ఇంగ్లాండ్ పౌండ్స్-5, యువాన్-10, శ్రీలంక-2 వచ్చాయి. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ ఎస్.కనకరాజు, సీనియర్ అసిస్టెంట్లు ఎ.శ్రీనివాస్, ఎ.శోభనాద్రాచార్యులు, జూనియర్ అసిస్టెంట్లు కేవీ రమణమూర్తి, ఎం.కావ్యశ్రీ, ఏపీజీవీబీ సిబ్బంది, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Latest News