by Suryaa Desk | Sun, Jan 26, 2025, 08:01 PM
తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో ఈనెల 31న తితిదే పాలకమండలి అత్యవసరంగా సమావేశం కానుంది. రథసప్తమి సందర్భంగా ఏర్పాట్లపై తితిదే సభ్యులు, అధికారులతో పాలక మండలి సమీక్షించనుంది. భక్తులకు సౌకర్యాలపై అధికారులకు తితిదే ఛైర్మన్ సూచనలు చేయనున్నారు. రథసప్తమి రోజున ఏడు వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. తిరుపతి ఘటన దృష్ట్యా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు సర్వదర్శనం టోకెన్ల జారీ రద్దుపై తితిదే ఇప్పటి ప్రకటన చేసింది. ఫిబ్రవరి 4న ఆర్జిత సేవలు, సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు.
Latest News