![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 26, 2025, 03:55 PM
రాష్ట్రంలో సామాజిక పింఛన్ల పంపిణీలో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పింఛన్ల పంపిణీలో తరచూ అవకతవకలు జరుగుతుండడంతో ఇకపై అధునాతన ఎల్-1 స్కానర్లను వినియోగించాలని నిర్ణయించింది.
ఈ మేరకు ఇప్పటికే ఈ స్కానర్ల వినియోగంపై పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమం చేపట్టింది. దీంతో ఏప్రిల్ నుంచి అందించనున్న పింఛన్ల పంపిణీలో ఈ స్కానర్లనే వినియోగించనుంది.