![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 02:22 PM
వైఎస్సార్ కడప జిల్లా జెడ్పీ చైర్మన్‌గా బ్రహ్మంగారిమఠం జెడ్పీటీసీ సభ్యుడు ముత్యాల రామగోవిందురెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ డిక్లరేషన్ అందజేసి, ప్రమాణ స్వీకారం చేయించారు. గురువారం ఉదయం 10 గంటలకు సహాయ ఎన్నికల అధికారి, జెడ్పీ సీఈఓ ఓబుళమ్మ వద్ద నామినేషన్ దాఖలు చేశారు. 11 గంటలకు ఎన్నికల ప్రక్రియ మొదలైంది. రామగోవిందురెడ్డి అభ్యరి్థత్వాన్ని మాత్రమే జెడ్పీటీసీ సభ్యులు ప్రతిపాదించడం, బలపర్చడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించారు. జిల్లాలోని 48 మంది జెడ్పీటీసీ సభ్యుల్లో ఒక్కరు మాత్రమే టీడీపీ సభ్యుడు. ఐదుగురు వైఎస్సార్‌సీపీ సభ్యులను టీడీపీ నేతలు బలవంతంగా, ప్రలోభాలతో ఆ పారీ్టలోకి లాక్కున్నారు. ఈ లెక్కన వైఎస్సార్‌సీపీకి నికరంగా 42 సభ్యుల మద్దతు ఉండగా, వేంపల్లె జెడ్పీటీసీ సభ్యుడు రవికుమార్‌రెడ్డి మాతృమూర్తి వియోగంతో ఎన్నికకు హాజరు కాలేకపోయారు. దీంతో 41 మంది జెడ్పీటీసీ సభ్యులు రామగోవిందురెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Latest News