|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 08:38 PM
ఢిల్లీలో జరిగిన స్టాండింగ్ కమిటీ ఆన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సమావేశంలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖకు సంబంధించిన 169వ, 170వ నివేదికలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై చర్చ జరిగింది. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు దోహదపడే విధాన నిర్ణయాల్లో భాగస్వామ్యం కావడం పట్ల ఎంపీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ చర్చ ప్రజారోగ్యానికి సంబంధించిన కీలక అంశాలపై దృష్టి సారించింది.
Latest News