|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 04:12 PM
భారత్‌లో రైలు టికెట్ ధరలు పొరుగు దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. గతేడాది ప్రయాణికుల టికెట్ ధరలను అందుబాటులో ఉంచడానికి రూ.60వేల కోట్లు సబ్సిడీగా అందించామని ఆయన పేర్కొన్నారు. వయోవృద్ధులకు రైలు టికెట్ రాయితీని పునరుద్ధరించే ఆలోచన ప్రభుత్వానికి ఉందా అని కాంగ్రెస్ ఎంపీ ఎంకే విష్ణు ప్రసాద్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ సమాధానమిచ్చారు. కరోనా సమయంలో సీనియర్ సిటిజన్లకు ఇచ్చిన రాయితీలను కేంద్రం ఎత్తివేసింది, ఆ తర్వాత వాటిని పునరుద్ధరించలేదు
Latest News