|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 07:06 PM
AP: రేపు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అమరావతి నిర్మాణానికి నాబార్డు నుంచి రూ.7,380.70 కోట్లు రుణం తీసుకునేందుకు CRDAకి అనుమతి ఇవ్వనున్నారు. సీడ్ యాక్సిస్ రహదారిని జాతీయ రహదారి–16తో అనుసంధించే పనులకు రూ.532 కోట్లు ఆమోదించనున్నారు. పలు సంస్థలకు భూ కేటాయింపులు, రూ.169 కోట్లతో లోక్ భవన్ నిర్మాణ టెండర్లకు, రూ.163 కోట్లతో జ్యుడిషియల్ అకాడమీ పరిపాలనా అనుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. కాగా, 56 వేల ఉద్యోగాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
Latest News