|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 09:59 PM
ఐపీఎల్ 2026 వేలం మరో ఆరు రోజుల్లో జరగనుంది. డిసెంబర్ 16న అబుదాబీ వేదికగా ఈ వేలం జరగనుంది. ఈ వేలం కోసం మొత్తంగా 359 మంది ప్లేయర్లు షార్ట్ లిస్ట్ అయ్యారు. ఇందులో ప్రధానమైన ఆటగాళ్ల కోసం ఫ్రాంఛైజీలు ఫోకస్ చేశాయి. అయితే ప్రస్తుతం వేలంలోకి రానున్న ఆటగాళ్లలో ఏయే ఆటగాళ్లకు ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం..
కామెరూన్ గ్రీన్ ..
ఆస్ట్రేలియా యంగ్ ఆల్‌రౌండర్ ఐపీఎల్ 2026 వేలంలో అత్యధిక ధర పలికే ఆటగాడిగా నిలిచే అవకాశం ఉంది. గాయం కారణంగా గత సీజన్‌కు అతడు దూరమయ్యాడు. అయితే ఈ ఏడాది అతడు టీ20 క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఐపీఎల్ 2024లో గ్రీన్ 255 పరుగులు చేయడంతో పాటు 10 వికెట్లు తీశాడు. అతడు ఈజీగా రూ.20 కోట్లకుపైగా ధర పలికే అవకాశం ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ లేదా చెన్నై సూపర్ కింగ్స్ అతడి కోసం గట్టిగా ప్రయత్నించే అవకాశం ఉంది.
మతీశ పథిరాన..
చెన్నై సూపర్ కింగ్స్ పథిరానను విడుదల చేస్తుందని ఎవరూ అనుకోలేదు. కానీ ఆశ్చర్యకరంగా ఆ ఫ్రాంచైజీ ఈ శ్రీలంక పేసర్‌ను రిలీజ్ చేసింది. యార్కర్ కింగ్‌గా పేరు సంపాదించిన అతడు కూడా వేలంలో భారీ ధర పలికే అవకాశం ఉంది.
రవి బిష్ణోయ్..
లెగ్ స్పిన్నర్, భారత్‌కు చెందిన రవి బిష్ణోయ్‌కు కూడా భారీ డిమాండ్ ఉండే అవకాశం ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ అతడిని విడుదల చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పాటు, చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ అతడిని దక్కించుకునే అవకాశం ఉంది.
వెంకటేష్ అయ్యర్ & పృథ్వీ..
భారత్‌కు చెందిన వెంకటేశ్ అయ్యర్, పృథ్వీషా కూడా ఫ్రాంఛైజీలను ఆకర్షించే అవకాశం ఉంది. గత సీజన్‌లో భారీ ధరకు దక్కించుకున్న తర్వాత కేకేఆర్ అయ్యర్‌ను విడుదల చేసింది. మరోవైపు గత సీజన్‌లో అన్‌సోల్డ్‌గా మిగిలిన పృథ్వీషా ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. వీరిద్దరూ మంచి ధర పలుకుతారనే అంచనాలు ఉన్నాయి.
లియామ్ లివింగ్‌స్టోన్..
గతేడాది ఆర్సీబీ తరఫున ఆడిన లియామ్ లివింగ్‌స్టోన్.. ఈసారి వేలంలోకి వ్చచాడు. బౌలింగ్ చేసే సామర్థ్యంతో పాటు ఫినిషర్‌గానే రాణించే అతడికి భారీ డిమాండ్ ఉండొచ్చు!
Latest News