|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 12:22 PM
రాష్ట్రంలో ఎక్కడ, ఏం జరిగినా, ఎవరు నేరం చేసినా.. దాన్ని వైయస్ఆర్‌సీపీకి అంటగట్టి పబ్బం గడుపుకోవాలనుకోవడం సిగ్గుచేటు. అప్పన్న అనే వాడు వేమిరెడ్డి పీఏ అని ధృవీకరించే విధంగా కళ్ల ముందు ఆధారాలు కనిపిస్తున్నా.. ఇంకా ప్రజలను తప్పదోవ పట్టించే ప్రయత్నం చేయాలను కోవడం అవివేకం. చంద్రబాబు మోసాలను ప్రజలు గ్రహించారు. ఆయన ఆటలు సాగడం లేదు కాబట్టే.. తమ పార్టీపైనా, తమ పార్టీ నాయకుల మీద దుష్ప్రచారం చేస్తూ, బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని పుత్తా శివశంకర్‌రెడ్డి ఆక్షేపించారు. టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చెందిన వీపీఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి రెండేళ్లుగా అప్పన్న అకౌంట్‌లో రూ.25 వేల చొప్పున జమ చేస్తూ, అప్పన్నతో సంబంధమే లేదని ఎంపీ చెప్పడం విడ్డూరంగా ఉందని, ఏ సంబంధం లేకపోతే ఇంతకాలం డబ్బులిస్తారా అని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2023 మార్చి నుంచి 2025 మార్చి వరకు కూడా, ప్రతి నెలా ఒకటి లేదా రెండు తేదీల్లో ఠంచన్‌గా ఎంపీ వేమిరెడ్డి మైనింగ్ కంపెనీ నుంచి నెఫ్ట్ ద్వారా నగదు చేయడంపై టీడీపీ నాయకులు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. వైయస్ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పడంతోనే సాయం చేశానని చెబుతున్న వేమిరెడ్డి, పార్టీ మారి టీడీపీ నుంచి దంపతులిద్దరూ ఎంపీ, ఎమ్మెల్యేలుగా గెలిచిన ఏడాదిన్నర వరకు కూడా ప్రతినెలా సాయం చేస్తారా అని ప్రశ్నించారు.
Latest News