|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 12:23 PM
అధికారం చేపట్టినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం హైందవ ధర్మానికి తూట్లు పొడుస్తుందని, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... తిరుమలను రాజకీయ వేదిక చేసుకున్న చంద్రబాబు అనుక్షణం వైయస్.జగన్, వైయస్ఆర్‌సీపీ నేతలపై బురద జల్లడమే లక్ష్యంగా చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకుంఠఏకాదశి తొక్కిసలాట, తిరుమలలో మాంసం, మద్యం వినియోగం వంటి ఘటనల ద్వారా తిరుమల క్షేత్ర పవిత్రత మంటగలుస్తుంటే... తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని తేల్చి చెప్పారు. బీఆర్ నాయుడు టీటీడీ పాలకమండలి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నుంచే.. తిరుమలలో వరుసగా అపశకునాలు చోటు చేసుకుంటున్నాయని ఆక్షేపించారు. తన వెనుక ఓ న్యాయమూర్తి ఉన్నాడంటూ చేసిన ఆరోపణలపై మండిపడ్డ భూమన దమ్ముంటే ఆయన పేరు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు తన మీద చేస్తున్న ఆరోపణలపై ఏ విచారణకైనా తాను సిద్ధమేనని మరోసారి సవాల్ చేశారు.
Latest News