|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 09:45 AM
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో ప్రజలు చేసిన సంతకాలే కూటమి ప్రభుత్వానికి ఉరితాళ్లు అవుతారని వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు. గుంతకల్లు నియోజకవర్గంలో రచ్చబండ-కోటి సంతకాలు కార్యక్రమంలో భాగంగా చేయించిన 60 వేల సంతకాల ప్రతులను శుక్రవారం నియోజకవర్గ కేంద్రంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..`వైయస్ఆర్‌సీపీ పాలనలో పేదలకు మరింత మెరుగైన ఉచిత వైద్యం, పేద విద్యార్థుల ఉన్నతికి ఉచిత వైద్య విద్యను అందించాలన్న సంకల్పంతో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను స్థాపించారు. అలాంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తయితే జగనన్నకు ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న దురాలోచనతో వైద్య విద్యపై నీచ రాజకీయాలు చేస్తున్న ప్రజాద్రోహి చంద్రబాబు. కూటమి ప్రభుత్వం నియంత పోకడలతో ముందుకెళ్తోంది. ఇది ప్రజా తిరుబాటుకు నాంది. ఈ తిరుబాటు కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించివేస్తుంది. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నా చంద్రబాబు ప్రభుత్వం ఏమీ చేయకపోవడంతో ప్రజలంతా విసిగిపోయి ఉన్నారు. ప్రజా వ్యతిరేకానికి నిదర్శనమే మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రజాఉద్యమానికి అపూర్వ స్పందన లభించింది. సేకరించిన ప్రతులను ఈ నెల 15న జిల్లా కేంద్రం అనంతపురంలో భారీ ర్యాలీ నిర్వహించి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపిస్తాం. ఈ ర్యాలీలో పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనాలి` అంటూ వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు.
Latest News