|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 04:44 PM
వైసీపీ నేత రోజాపై సొంత నియోజకవర్గం నగరి టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రోజా రాజకీయ జీవితం తాము పెట్టిన భిక్షేనని, ఆమె అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈరోజు నగరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీశైలం బోర్డు మాజీ చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, పలువురు ఎంపీపీలు రోజాపై తీవ్ర విమర్శలు చేశారు.ఈ సందర్భంగా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ నగరిలో రోజా రాజకీయ భవిష్యత్తు ముగిసింది. ఇక ఆమె జీవితంలో ఇక్కడ గెలవలేదు. ఎంపీపీ ఎన్నికలు న్యాయబద్ధంగానే జరిగాయి. 'ఓ అబ్బకు పుట్టావా' అంటూ ఆమె మాట్లాడటం బాధాకరం. ఆమె ఎవరికి పుట్టారో తెలుసుకోవాలి. నియోజకవర్గ చరిత్రలోనే అత్యంత దారుణంగా ఓడిపోయింది రోజానే. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపిస్తాం" అని హెచ్చరించారు.మరో నేత, వడమాలపేట జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ రోజా ఫస్ట్రేషన్‌తో మదమెక్కి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మేము పార్టీ మారలేదు. టీడీపీ తరఫున రెండుసార్లు ఓడిపోయి, పార్టీ మారి మా దయతో ఎమ్మెల్యే అయింది రోజానే. 2014కు ముందు ఆమె ఆర్థిక పరిస్థితి ఏంటి ఇప్పుడు ఏంటి ఆమె వల్లే మేము పార్టీ మారాం అని స్పష్టం చేశారు.సీనియర్ నేత అమ్ములు మాట్లాడుతూ మేము సాయం చేస్తేనే రోజా నిలబడ్డారు. ఆమె, ఆమె కుటుంబం నగరిని దోచుకున్నారు. ఆమె నోటి వల్లే రాష్ట్రంలో వైసీపీకి ఈ గతి పట్టింది. నోరు అదుపులో పెట్టుకోకపోతే సహించేది లేదు అని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
Latest News