|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 07:14 PM
జిల్లాలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఈ నెల 14న మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని 10 మండలాల్లోని 282 గ్రామ పంచాయతీలలో 2418 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. దామరచర్ల పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ, పోలింగ్ కేంద్రాలలోకి సెల్ఫోన్లు, వాటర్ బాటిల్స్, ఇంకు బాటిల్స్, పెన్నులు, అగ్నికి సంబంధించిన వస్తువులకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
Latest News