|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 07:17 PM
నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు, మరణాలకు కారణమవుతున్న యువకులకు తగిన గుణపాఠం నేర్పాలని, వారిని కొద్ది రోజుల పాటు జైల్లో ఉంచాలని సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. గత ఏడాది ముంబైలో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిగా ఉన్న మిషార్ షా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ దీపా శంకర్, జస్టిస్ ఏజీ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. మద్యం మత్తులో కారు నడుపుతూ స్కూటీని ఢీకొట్టి, మహిళ మృతికి కారణమైన మిహిర్ షా కేసులో బెయిల్ నిరాకరించిన ముంబై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
Latest News