|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 08:01 PM
ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కొయ్యలగూడెం శివారు పులి వాగు వద్ద గాడాల నుంచి జంగారెడ్డిగూడెం వైపు వెళ్తున్న బైక్‌ను ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనల జయరాజు (52), సత్యవతి (45) అనే దంపతులు మరణించారు. మనవరాలి అన్నప్రాసనానికి వెళ్తుండగా ఈ విషాద ఘటన చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Latest News