|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 07:35 PM
సోషల్ మీడియా వాడకం పెరిగాక రోజుకో కొత్త తరహా మోసం వెలుగులోకి వస్తోంది. తెల్లారి లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా ఇదే పని.. పొద్దున్నే ఫేస్ బుక్, మధ్యాహ్నం మెసేంజర్, సాయంత్రం షేర్ చాట్.. రాత్రికి ఇన్‌స్టాగ్రామ్.. బయటి ప్రపంచంతో పని లేకుండా, సోషల్ మీడియాకు అతుక్కుపోతున్నారు నేటి యువతరంలో చాలా మంది. అందులో వచ్చే ప్రతీదీ నిజమేనని నమ్మేస్తున్నారు. సోషల్ మీడియా మాయలోపడి మోసపోతున్నారు.. ఆనక అసలు విషయం తెలిసీ, లబోదిబోమంటున్నారు.
*ఉపాధి హామీ కూలీలకు భారీ షాక్.. లక్షల్లో జాబ్ కార్డులు రద్దు..
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ ట్రాన్స్‌జెండర్‌కు ఇన్‌స్టాలో పరిచయమయ్యాడో యువకుడు. నువ్వు అందంగా ఉన్నావంటూ మొదలెట్టి.. తన మాటలతో మాయ చేశాడు. నిన్ను ప్రేమించానని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. కానీ అవసరానికి వాడుకుని.. ఆ తర్వాత మొహం చాటేశాడు.
నెల్లూరు జిల్లా జొన్నవాడలో ఓ ట్రాన్స్‌జెండర్.. ఓ ఆలయ ఉద్యోగిపై దాడి చేశారు. రూ.1500 తీసుకుని తిరిగి ఇవ్వకుండా తనను మోసం చేశాడంటూ ఆలయ ఉద్యోగిపై దాడి చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా ఓ ఆలయంలో పనిచేసే ఓ యువకుడు.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ట్రాన్స్‌జెండర్‌కు పరిచయమయ్యాడు. ఫేక్ అకౌంట్ ద్వారా హిజ్రాకు సందేశాలు పంపించాడు. తాను తిరుపతిలో పనిచేస్తున్నానని నమ్మించాడు. నువ్వు అందంగా ఉన్నావని.. నిన్ను పెళ్లి చేసుకుంటానని బుట్టలోకి దింపాడు.
ఆ తర్వాత ఓ రోజు తనకు అర్జంటుగా రూ.1500 డబ్బులు అవసరమయ్యాయని.. వెంటనే పంపిస్తే, రాత్రికల్లా రూ.2 వేలు తిరిగి పంపిస్తానని నమ్మించాడు. దీంతో ఆ ట్రాన్స్‌జెండర్ నిజమేనని నమ్మి.. ఆ యువకుడికి 15 వందలు పంపించారు. అయితే తిరిగి పంపకపోవటంతో .. మోసపోయానని గ్రహించారు. ఆరా తీస్తే.. అతను ఆలయంలో పనిచేసే కుర్రాడని తెలుసుకున్నారు. దీంతో ఆలయం వద్దకు చేరుకున్న ట్రాన్స్ జెండర్ తన వద్ద నుంచి డబ్బులు తీసుకుని మోసగించావంటూ ఆ యువకుణ్ని చితకబాదారు. తన డబ్బు తిరిగి ఇవ్వాలని గొడవ చేశారు. ఈ దృశ్యాలను పక్కనున్న వ్యక్తులు వీడియో తీయగా.. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Latest News