|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 07:35 AM
దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదో టీ20లో 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత జట్టు 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సంతోషం వ్యక్తం చేసినప్పటికీ, తన వ్యక్తిగత బ్యాటింగ్ ఫామ్‌పై మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నానని నిజాయతీగా అంగీకరించాడు. భవిష్యత్తులో కచ్చితంగా బలంగా పుంజుకుంటానని అభిమానులకు హామీ ఇచ్చాడు.ఈ సిరీస్‌లో సూర్యకుమార్ వరుసగా 12, 5, 12, 5 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఈ సిరీస్‌లో బహుశా మేం సాధించలేనిది ఒక్కటే సూర్య’ అనే బ్యాటర్‌ను వెతకలేకపోయాం. అతను ఎక్కడో మిస్ అయ్యాడు. కానీ, కచ్చితంగా బలంగా తిరిగి వస్తాడు. ఒక జట్టుగా మా ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు బాధ్యత తీసుకుని జట్టును గెలిపించారు. కెప్టెన్‌గా ఇది నాకు ఎంతో సంతృప్తినిచ్చింది అని అన్నాడు.సిరీస్ ప్రారంభం నుంచే ఒక నిర్దిష్టమైన దూకుడైన ఆటతీరును ప్రదర్శించాలని అనుకున్నాం. దానికే కట్టుబడి ఉన్నాం. ఎలాంటి ప్రయోగాలు చేయలేదు. మా బ్యాటర్లు అదే దూకుడును ప్రదర్శించారు. ఫలితాలు మీ ముందు ఉన్నాయి అని సూర్యకుమార్ వివరించాడు. బౌలింగ్ వ్యూహాల గురించి మాట్లాడుతూ బుమ్రాను పవర్‌ప్లే, మిడిల్ ఓవర్లు, డెత్ ఓవర్లలో ప్రణాళిక ప్రకారం ఉపయోగించామని, వాషింగ్టన్ సుందర్ కూడా అద్భుతంగా రాణించాడని ప్రశంసించారు.మరోవైపు, దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ మాట్లాడుతూ 232 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు అద్భుత ప్రదర్శన అవసరమని, తాము మిడిల్ ఓవర్లలో పట్టు కోల్పోయామని తెలిపాడు. ఈ సిరీస్ నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. వరల్డ్ కప్ సన్నాహకాలకు ఈ అనుభవం ఎంతో ఉపయోగపడుతుంది. మా జట్టు కూర్పుపై కూడా ఒక స్పష్టత వచ్చింది అని మార్‌క్రమ్ పేర్కొన్నాడు
Latest News