|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 11:56 AM
కలెక్టర్లు సరిగా పని చేయడం లేదంటే అది చంద్రబాబు వైఫల్యమేనని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలకు కలెక్టర్లు కేవలం డెలివరీ మెకానిజమ్ మాత్రమే అని, వారికి దిశానిర్దేశం చేసేది సీఎం అని ఆయన గుర్తు చేశారు. తన వైఫల్యాలు, తప్పులను అధికారులపై వేసి, సీఎం చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కలెక్టర్లు, ఎస్పీల సమావేశం పేరుతో సీఎం చేసింది పాలనా సమీక్ష కాదని, ఒక కాలక్షేప కార్యక్రమం అని తేల్చి చెప్పారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పేదలకు మెరుగైన వైద్యం దూరం చేస్తున్నారని మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి పేర్ని నాని ఆక్షేపించారు.
Latest News