|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 09:14 PM
బంగ్లాదేశ్‌లో అరాచక శక్తులు రెచ్చిపోతున్నాయి. మతపరమైన ఆరోపణల సాకుతో సామాన్యులపై జరుగుతున్న దాడులు ఆ దేశ ప్రతిష్ఠను అంతర్జాతీయంగా దిగజార్చుతున్నాయి. ఇటీవల 25 ఏళ్ల దీపూ చంద్రదాస్ అనే హిందూ యువకుడిని "ఇస్లాంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడన్న" నెపంతో నిరసనకారులు క్రూరంగా కొట్టి చంపిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ అమానుష కాండపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవ్వడంతో.. ఎట్టకేలకు యూనస్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
ఏడుగురి అరెస్ట్.. ప్రభుత్వం సీరియస్
దీపూ చంద్రదాస్ హత్య కేసులో ఇప్పటి వరకు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు అధికారికంగా ప్రకటించారు. "మా పాలనలో మూక దాడులకు తావులేదు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారికి కఠిన శిక్షలు తప్పవు" అని ఆయన హెచ్చరించారు. అల్లర్లపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేశామని, ప్రజలందరూ సంయమనం పాటించాలని కోరారు. అయితే క్షేత్రస్థాయిలో హిందువులపై జరుగుతున్న దాడులు ఇంకా ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి.
బంగ్లాదేశ్‌లో పరిస్థితులు ఇంకా అదుపులోకి రాకపోవడంతో అక్కడి భారత హైకమిషన్ కీలక సూచనలు చేసింది. బంగ్లాదేశ్‌లో నివసిస్తున్న భారతీయ పౌరులు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది. స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు విద్యార్థుల ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన యువనేత షరీఫ్ ఉస్మాన్ హాదీ మృతితో రాజధాని ఢాకాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. శనివారం ఆయన అంత్యక్రియల సందర్భంగా భారీ ఎత్తున నిరసనకారులు గుమిగూడారు
Latest News