|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 01:53 PM
AP: ఓ కేసులో న్యాయం జరగలేదనే కారణంతో ఇద్దరు మహిళలు పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకున్నారు. నంద్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటనలో.. తల్లీకూతుళ్లైన మార్తమ్మ, బందెల స్పందన పోలీసుల ఫొటోలను అభ్యంతరకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పలుమార్లు హెచ్చరించినా తీరు మార్చుకోకపోవడంతో వారిపై కేసులు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గతంలో వీరిపై కోవెలకుంట్ల పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
Latest News