|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 01:55 PM
2026 టీ20 ప్రపంచకప్ జట్టులో శుభ్‌మన్ గిల్‌ను తీసుకోకపోవడం ఆశ్చర్యమని మాజీ కెప్టెన్ క్రిస్ శ్రీకాంత్ అన్నారు. అజిత్ అగార్కర్ కమిటీ ఇంత కఠిన నిర్ణయం తీసుకుంటుందని ఊహించలేదన్నారు. అయితే ఎంపికైన జట్టు బలంగా ఉందని ప్రశంసించారు. గిల్ వన్డేల్లో మెరుగైన ఆటగాడైనా, టీ20ల్లో స్ట్రైక్‌రేట్ తక్కువగా ఉందని, ఇషాన్ కిషన్, రింకు సింగ్ ఎంపిక సరైనదని చెప్పారు. అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఓపెనర్లు అవుతారని తెలిపారు.
Latest News