|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 11:04 AM
భారత్, న్యూజిలాండ్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి విన్‌స్టన్ పీటర్స్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం న్యూజిలాండ్‌కు నష్టం చేకూరుస్తుందని, ముఖ్యంగా పాల ఉత్పత్తుల కోసం భారత్ మార్కెట్ తెరవకపోవడం తమ రైతులకు ప్రయోజనకరం కాదని ఆయన అన్నారు. దీని ద్వారా వచ్చే 15 ఏళ్లలో భారత్‌లో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులను న్యూజిలాండ్ పెట్టనుంది. అయితే, డెయిరీ ఉత్పత్తులు, చక్కెర వంటి వాటిపై భారత్ ఎటువంటి మినహాయింపులు ఇవ్వలేదు.
Latest News