|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 01:51 PM
భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న న్యూజిలాండ్ పర్యటనకు సమయం సమీపిస్తోంది. కివీస్‌తో జరిగే వన్డే సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేసేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఈ జట్టు ఎంపికలో వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ ఫిట్‌నెస్, పునరాగమనంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. వన్డే వరల్డ్ కప్ 2023 తర్వాత గాయంతో జట్టుకు దూరమైన షమీ, దేశీవాళీ క్రికెట్‌లో తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నారు. సెలక్టర్లు అతడిని నేరుగా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోకి తీసుకుంటారా, మరికొంత కాలం విశ్రాంతినిస్తారా అనేది తేలాల్సి ఉంది.
Latest News