|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 03:33 PM
రాజధాని అమరావతిలో వరద సమస్యకు పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాజధాని ప్రాంతంలో భారీ వర్షాలు కురిసినప్పుడు, నీరు నిల్వలు ఏర్పడకుండా ఉండేందుకు చేపడుతున్న వరద నియంత్రణ చర్యల్లో భాగంగా, ఉండవల్లి గ్రామం వద్ద ‘పంపింగ్ స్టేషన్–2’ నిర్మాణానికి టెండర్లను ప్రభుత్వం ఖరారు చేసింది.అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ADCL) ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును జోన్–8 పరిధిలో నిర్మించనున్నారు. ఈ పంపింగ్ స్టేషన్ ద్వారా వరదల సమయంలో సుమారు 8,400 క్యూసెక్కుల నీటిని కృష్ణా నదిలోకి పంపించేలా డిజైన్ చేశారు. వర్షాకాలంలో రాజధాని ప్రాంతంలో నీటి ముంపు ఏర్పడకుండా ముందస్తు రక్షణ కల్పించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.ఈ పనులకు సంబంధించిన టెండర్లలో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రా (MEIL) సంస్థ L1 బిడ్‌గా నిలవడంతో, ఆ సంస్థకే ప్రాజెక్టు బాధ్యతలను అప్పగిస్తూ ADCL నిర్ణయం తీసుకుంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా ఆమోదం తెలిపింది. మొత్తం రూ.443.76 కోట్ల అంచనా వ్యయంతో ఈ పంపింగ్ స్టేషన్ నిర్మాణం చేపట్టనున్నారు.
Latest News