|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 08:21 PM
జామపండు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం, కరిగే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తపోటును నియంత్రిస్తాయి. స్త్రీలలో ఋతుక్రమ సమస్యలకు, కడుపు నొప్పితో పాటు జీర్ణక్రియ మెరుగుపరచడంలో జామ సహాయపడుతుంది. నారింజ కంటే రెట్టింపు విటమిన్ సీ కలిగి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది.
Latest News